
మహిళా చట్టాల పైన అవగాహన అవసరం
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పు) లో శ్రీమతి సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
స్త్రీల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సరళా దేవి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య , పాజిటివ్ దృక్కోణంతో కూడిన సమానత్వం,నేడు అవసరం అని ఆమె అన్నారు.గృహ హింస చట్టం, కుటుంబంలో స్త్రీల పాత్ర, సాంకేతిక మాద్యమ వినియోగం పట్ల అవగాహన,అప్రమత్తత
తదితర అంశాల పై విద్యార్థులను చైతన్యపరిచారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జే. హేమంత్, ఎ. సత్యనారాయణ, IQAC కో ఆర్డినేటర్ డా. ఫకృన్నీసా బేగం, శ్రీమతి సుజాత, నగరత్న, మెహర్ జహాన్,డా. మాదన్న సీనియర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మహిళా చట్టాలను,ఇతర విషయాలను ముఖ్య అతిథిని అడిగి తెలుసుకున్నారు.