
పారిశుద్ధ్య కార్మికులకు ఘనసత్కారం
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ప్రపంచ పారిశుద్ధ్య కార్మిక దినోత్సవ సందర్భంగా ఒంటిమిట్ట ఎంపీడీవో సోమశేఖర్ మంగళవారం ఒంటిమిట్ట పంచాయతీలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా పూలమాలతో సత్కరించి 25 కేజీల ప్యాకెట్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ప్రభుత్వాధికారులు ఇచ్చిన బాధ్యత ప్రకారం గ్రామంలో, పంచాయితీలో ఉన్న చెత్తను చదరాన్ని ఏ రోజు కా రోజు శుభ్రం చేస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని వారు చేసే సేవ ఎన్నటికీ మరిచిపోవద్దని సమావేశంలో అన్నారు. కావున పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం బాధ్యతని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఒంటిమిట్ట పంచాయతీ సెక్రటరీ సుధాకర్ తదితర సిబ్బంది ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!