జిల్లా రిజిస్ట్రార్… సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై చర్యలు తీసుకోండి..!

న్యూస్​ వెలుగు కర్నూలు:  జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వర రావు మరియు కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ల అక్రమాలపై చర్యలు తీసుకోండి.రాయలసీమ యువజన పోరాట సమితి ఆద్వర్యంలోడిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్. పి.జి.యస్. కళ్యాణి కి ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా రాయలసీమ యువజన విద్యార్థి  నాయకులు వి.వి.నాయుడు తెలిపారు. ఈ సందర్బంగా  నాయకులూ  కె.రవికుమార్  మాట్లాడుతూ కల్లూరు సబ్ రిజిస్ట్రార్  కల్లూరు గ్రామ రెవెన్యూ విటల్ నగర్ దగ్గర సర్వేనెంబర్ : 767/2 అగ్రసేని రియల్టర్ బి.కె.సింగ్ కు 43 సెంట్లకు మాత్రమే డాక్యుమెంట్ ఉంటే, 2.75 సెంట్లు చొప్పున 60 ఇండ్లకు పైగా ఇదే సర్వేనెంబర్ తో రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. దీనిపై గతంలో డి.ఐ.జి. కి, మరియు జిల్లా రిజిస్ట్రార్ కి ఫిర్యాదు  చేసామన్నారు.  డి.ఐ.జి. కూడా దీనిపై డీటేయిల్డ్ రిపోర్ట్ పంపమని జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వర రావుకు మెమో కూడా పంపడం జరిగిందన్నారు. కానీ జిల్లా రిజిస్ట్రార్  ఈ కంప్లైంట్ ను తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని,  అక్రమార్కులతో చేతులు కలిపి డి.ఐ.జి. మెమోకు ఇంతవరకు రిపోర్ట్ పంపకుండా, కంప్లైంట్ దారులైన మాకు మాత్రం తను కంప్లైంట్ కు సంబందం లేని విషయాలు కనబరుస్తూ కోర్డుకు వెళ్ళమని చెప్పడంలోని ఆంతర్యం క్లుప్తంగా బయట పడింది అన్నారు. ఇలా అనేక మంది చేసిన ఫిర్యాదుపై  ఇదే రీతిలో ఆయన  అధికార దుర్వినియోగం చేసారన్నారు. ఇలాంటి అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసిన కల్లూరు సబ్ రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.  హంద్రీనదిలోని నిర్మాణాలకు పొజిషన్ కు సంబంధం లేని సర్వేనెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం మరియు విస్తీర్ణంకు మించి రిజిస్ట్రేషన్లు చేయడం వలన అక్రమార్కలు చెలరేగిపోతున్నారన్నారు, దీనివలన ప్రజలకు నష్టం జరుగడమే కాక ప్రభుత్వ భూములు  అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు.  ఇటువంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న కార్యాలయంలో డి.ఐ.జిని కలసి మరొకసారి కంప్లైంట్ చేశామన్నారు.  చర్యలు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డి.ఐ.జి.  స్పందిస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!