రికవరీ సొమ్మును బాధితులకు అప్పగించిన కర్నూల్ 4వ పట్టణ పోలీసులు

రికవరీ సొమ్మును బాధితులకు అప్పగించిన కర్నూల్ 4వ పట్టణ పోలీసులు

న్యూస్ వెలుగు, కర్నూలు; రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించామని కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్ ఈ మేరకు ఆదివారం కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ మధుసూదన్ గౌడ్ వివరాలు వెల్లడించారు. 6 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదును బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 21వ తేది, నంద్యాల జిల్లా, సున్నిపెంట గ్రామానికి చెందిన కాత రామిరెడ్డి, అతని భార్య సున్నిపెంట నుండి కర్నూలు ఒక వివాహ కార్యక్రమము కు హాజరు అయ్యి, తిరిగి సున్నిపెంట కు వెళ్తూ కర్నూలు బస్టాండ్ లో బస్సు ఎక్కగా, వారికి చెందిన ఒక బ్యాగ్ కర్నూలు బస్టాండ్ లో మర్చిపోయి వెళ్ళినాము అని, అందులో విలువైన బంగారు, వెండి అభారణములు కలవు అని కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో తెలియజే శారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కర్నూలు నాల్గవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, సిబ్బంది ని ప్రత్యేక బృందం గా ఏర్పాటు చేశారు. బ్యాగ్ కొరకు కర్నూలు బస్టాండ్ లో CCTV లను పరిశీలించి, పిర్యాదుదారుడి బ్యాగ్ ను 3 రోజులలో ట్రేస్ చేసి గుర్తించామన్నారు.
బాధితులు కాత రామిరెడ్డిని స్టేషన్ కు పిలిపించి సొమ్మును, నగదును అందజేశామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!