
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (వినికిడి పరీక్ష యంత్రo) ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ మిషన్ విరాళం
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అమీలియో హాస్పిటల్ కర్నూలు, డా.లక్ష్మీ ప్రసాద్, మూడు లక్షల 85 వేల రూపాయల విలువ గల వినికిడి పరీక్ష యంత్రo) ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ మిషన్ ఆసుపత్రికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు.
ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ యంత్రం అనేది నొప్పిలేని, నాన్‌వాసివ్ వినికిడి పరీక్ష చేసే యంత్రం ఇది వివిధ శబ్దాలులను వినగల వ్యక్తి సామర్థ్యాన్ని కొలుస్తుంది అని అన్నారు.
రోగులకు వినికిడి లోపం సంభవించిందో లేదో తెలుసుకోవడానికి శస్త్రచికిత్సకు ముందు మరియు తర్వాత వారి వినికిడిని పర్యవేక్షించడానికి ఆడియోమెట్రీ పరీక్ష చేస్తారని అన్నారు.
ఆసుపత్రికి వచ్చే సదరం పేషంట్స్ వారికి కూడా ఉపయోగిస్తామని అన్నారు.
ఆడియోమెట్రీ పరీక్ష మిషన్ ఇవ్వడానికి ముందు కొచ్చిన డా. లక్ష్మీ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆసుపత్రిలో ఇఎన్టి విభాగాలకు వీటిని అందించనున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.సీతారామయ్య, సీఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్,పి.సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, ఇఎన్టి హెచ్ ఓ డి, డా.వీరకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, డా.హరికిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.శ్రీదేవి, డా.మమత, మరియు అమీలియో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డా.లక్ష్మీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.