
కర్నూల్ మెడికల్ కాలేజ్ స్థలాన్ని షాపులకు ఇవ్వడాన్ని విరమిoచుకోవాలి
మళ్లీ ఇప్పుడు రోడ్డు వెడల్పులో భాగంగా ట్రాఫిక్ రద్దీ అవుతుందని మెడికల్ కాలేజ్ స్థలాన్ని కేటాయించాలని అనడం సమంజసo కాదని అన్నారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం మెరుగైన వసతులు అందించాల్సిన ప్రభుత్వం వైద్య విద్యార్థుల మెడికల్ కాలేజ్ స్థలాన్ని ఇవ్వాలి అని చెప్పడం విద్యార్థులకు సౌకర్యవంతమైన నాణ్యమైన విద్య అందకుండా చేయడమేనని విమర్శించారు.అక్కడ తొలగించే షాపులకు మరొకచోట స్థలాన్ని కేటాయించి ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు. స్థలాన్ని కేటాయించాలనే ఆలోచన విరమించుకోకపోతే మెడికల్ కాలేజ్ స్థలాన్ని కేటాయించాలని ఒత్తిడి చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు జిల్లాలోని విద్యార్థిని,విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అధికారులను హెచ్చరించారు.