హాస్పెట్ తుంగభద్ర డ్యాంను సందర్శించిన కర్నూలు ఎంపీ
ఆలూరు న్యూస్ : తుంగభద్ర డ్యామ్ యొక్క 19వ గేటు కొట్టుక పోవడంతో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, కర్నూలు MP బస్తిపాటి.పంచలింగాల, నాగరాజు, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్రగౌడ్, రాఘవేందర్ రెడ్డి, కలిసి తెగిపోయిన డ్యామ్ గేటును సందర్శించి తుంగభద్ర LLC ,అధికారులతో పాటు కర్ణాటక మినిస్టర్స్,మరియు ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి కర్నూలు MP బస్తిపాటి.నాగరాజు గేటు యొక్క మరమ్మత్తుల గురించి చర్చించారు. అధికారులు కర్ణాటక మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు, రేపు గేట్ యొక్క మరమ్మతులను చేపట్టి రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిగా నిర్మిస్తామనిఅధికారులు నేతలు హామీ ఇచ్చారు . MP బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఈ నీరు వృధా కావడం వల్ల దిగువ ప్రాంతాల్లో కర్నూలు ప్రాంతం వ్యవసాయానికి నీరుకరువవుతుందని, రైతాంగం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తుంగభద్ర ఎల్.ఎల్.సి సిబ్బందికి మంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్,మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి, ఆలూరు తాలూకా యువ నాయకులు బెల్లం రఘు ఆదోని మండల కన్వీనర్ బీపి. బసవరాజ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ చాగి.మల్లికార్జున రెడ్డి, తెలుగు యువత మండల నాయకులు నల్లారెడ్డి,నాగప్ప, యువజన కురువ సంఘం ఉపాధ్యక్షులు కే పరమేష్, రైతు రాగప్ప ఇతర ఆదోని ఆలూరు మంత్రాలయం నియోజకవర్గం రైతులు, రైతు సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నరు.