క్రీడరంగంలో కర్నూలుకు జాతీయస్థాయిలో గుర్తింపు త్వరలోనే వస్తుంది

క్రీడరంగంలో కర్నూలుకు జాతీయస్థాయిలో గుర్తింపు త్వరలోనే వస్తుంది

న్యూస్ వెలుగు, కర్నూలు; క్రీడారంగంలో కర్నూలుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ , కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో డిసెంబర్ 1, 2, 3 ,తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే అంతర్ జిల్లాల ఆట్యా పాట్యా క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా జట్టు క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కర్నూల్ లో క్రీడ రంగం అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలో త్వరలోనే జాతీయస్థాయిలో కర్నూలు గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. భీమవరంలో జరిగే అంతర్ జిల్లాల ఆట్యా పాట్యా పోటీలలో జిల్లా జట్టు క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. భీమవరం లాంటి దూర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో క్రీడాకారులు మంచి దుప్పట్లను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. అలాగే బయట ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని తీసుకోకుండా శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు .లేదంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. క్రీడాకారులు కలుషితమైన నీరు తాగకుండా శుభ్రమైన నీరు తీసుకోవాలన్నారు. కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల డయేరియా, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ వంటి వ్యాధులు వస్తాయన్నారు .విద్యార్థులు దోమకాటుకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ,ఒకవేళ దోమ కాటుకు గురైతే మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులకు గురయ్య అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని, శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు కీలకమని, చిన్నతనం నుండే క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి దేశ ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు అవుతారని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!