
కులగణన సర్వేలో కురువలను ఎస్సీల జాబితా నుంచి తొలగించాలి
హొళగుంద, న్యూస్ వెలుగు: మండలం పరిధిలోని హేబ్బటం,నెరనికి,మార్లమడికి తదితర చుట్టుపక్కల గ్రామాలలో సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు గత వైసిపి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనసర్వే నిర్వహించడం జరిగింది.ఈ నెలలో గ్రామ వార్డు సచివాలయాల బోర్డులో ప్రదర్శించిన జాబితా నుండి కురువలను ఎస్సీలుగా నమోదైన పేర్లను జాబితా నుండి తొలగించి,ఎస్సీలకు న్యాయం చేయాలని ఇలాంటి చర్యలకు పాల్పడిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం ఎస్ఐ బాల నరసింహులును ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోగిలతోట వీరేష్,కో-ఆర్డినేటర్ గోవర్ధన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది,సాయిరాం,మాల మహానాడు నాయకులు హేబ్బటం వన్నూరప్ప వెంకటరాముడు,మరియు దళిత సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!