కురువలు రాజకీయంగా ఎదగాలి – కర్నూలు ఎంపీ. బస్తిపాటి నాగరాజు 

కురువలు రాజకీయంగా ఎదగాలి – కర్నూలు ఎంపీ. బస్తిపాటి నాగరాజు 

కర్నూలు , న్యూస్ ​ వెలుగు :  కర్నూలు నగరం సమీపంలోని ఏ. పి. మోడల్ స్కూల్  పక్కన శ్రీ భీర లింగేశ్వర స్వామి ప్రాంగణంలో    2026 వ సంవత్సరం  క్యాలెండర్ ను కర్నూల్ ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు,  అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,, ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కే.ఏ.శ్రీనివాసులు, కల్లూరు మండలం సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్,గౌరవాధ్యక్షులు కె. కిష్టన్న దిశా కమిటీ సభ్యులు కె. దేవ శంకర్, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కె. రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి,ఎమ్మిగనూరు ట్రెసరీ సి. టి. ఓ. రఘునందన్, కె ఈశ్వరయ్య, జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న, నగర సంఘం కార్యదర్శి బి. రామకృష్ణ,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రదానకార్యదర్శి అనిత కురువ సంఘం నాయకులు గురువారం ఉదయం  క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం జిల్లా లో నూతన కురువ టీచర్లు, పోలీస్ లకు శాలువా, పూలమాల, భక్త కనకదాసు జ్ఞాపిక తో ఎం. పి. బస్తిపాటి నాగరాజు సత్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కురువలు అత్యధిక సంఖ్యలో గెలుపొందాలని సూచించారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలో పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు పోలీసులను ఉపాధ్యాయులను అభినందించారు, పిల్లలను బాగా చదివించుకోవాలని,రాబోయే మూడేళ్లలో  కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కావడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ కులస్థులందరూ ఐక్యంగా ఉండాలని పిల్లలను చదివించాలని ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని ఏ సమస్య వచ్చిన కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటామని తెలిపారుఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ సలహాదారులు పాలసుంకన్న ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ,.  కె. టి. ఉరుకుందు,బి వెంకటేశ్వర్లు, బి. సి. తిరుపాల్, పుల్లన్న, లింగన్న, కె. హనుమంతు, పిలిగుండ్ల నాగన్న, అంపయ్య, కె. ఉరుకుందు,ఓర్వకల్ అల్లబాబు,రేమట సర్పంచ్ వెంకన్న, మేకల శేషన్న,తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!