
పగిడిరాయి గ్రామం నందు భూ రీసర్వే పనులు ప్రారంభం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామం నందు భూ రిసర్వే పనులు ప్రారంభమయ్యాయని తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు.సోమవారం రోజున ఆమె మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడవ విడత పైలెట్ ప్రాజెక్టు ద్వారా పగిడిరాయి గ్రామం ఎంపికైందని, అధికారుల ఆదేశాల మేరకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన అనంతరం సోమవారం నుండి రీసర్వే పనులను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. పగిడిరాయి గ్రామం నందు భూరి సర్వే పనులను మాజీ నీటి సంఘం అధ్యక్షులు పాటిల్ ఈశ్వర్ రెడ్డి పూజ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు, మండల సర్వేయర్ సుధాకర్,వీఆర్వోలు నయోమి,రంగప్ప,నాగేంద్ర,డీలర్ సుంకన్న,నాగార్జున,మండల విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!