
మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని కలిసిన ఆదోని డివిజన్ నాయకులు
హొళగుంద, న్యూస్ వెలుగు; శుక్రవారం మంగళగిరిలో ఉన్న మాల కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మాలల వెనుకబాటుతనాన్ని వారి అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వడం అయినది. భవిష్యత్తులో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పర్యటించి మాలల అభివృద్ధికి కార్యచరణ రూపొందిస్తానని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు హామీ ఇవ్వడం అయినది. నాయకులు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య నాగప్ప తర్వాత కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం లో మాలలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నారని ఈసారైనా ఈ ప్రభుత్వం మాలలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, బాలాజీ, వన్నూరప్ప, గోపాల్, మల్లికార్జున, గిరి తదితరులు ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!