కె వి ఆర్  మహిళా డిగ్రీ కాలేజీ లో  న్యాయ విజ్ఞాన సదస్సు

 కె వి ఆర్  మహిళా డిగ్రీ కాలేజీ లో  న్యాయ విజ్ఞాన సదస్సు

న్యూస్ వెలుగు,  కర్నూల్; కర్నూలు కే. వి. ఆర్. గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీ నందు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య అధితులుగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి,  శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు ఎం. వెంకట హరినాధ్ హాజరయ్యారు. శేషాద్రి జడ్జి మాట్లడుతూ Pc & pndt యాక్ట్ ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు, బృణ హత్యలు చట్ట రీత్య నేరమని తెలిపారు. ఏ స్కాన్ సెంటర్ యైన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికీ శిక్ష తప్పదని తెలిపారు.మహిళల హక్కులు రక్షణ మరియు నిబంధనలను వివరించారు.ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్. 15100, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. 1098 మొదలగు అంశాలను గురించి వివరించారు.శాశ్యత లోక్ అదాలత్ చైర్మన్ శాశ్వత లోక్ అదాలత్ గురించి వివరించారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. శాంతి మాట్టాడుతూ డాక్టర్స్ ఎవరుకూడా లింగ నిర్ధారణ చేయకూడదని తెలిపారు.డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కన్సల్టెంట్ మరియు న్యాయవాది సుమలత గారు ఈ యాక్ట్ పై పేపర్ ప్రజన్ టేషను ఇచ్చారు. అనంతరం శిశు లింగ నిర్ధారణ వ్యతిరేక పతిజ్ఞ ను నిర్వహించారు. ఈ సమావేశం లో కే. వి. ర్. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ దేవిక రాణి,ఎన్. జి. ఓ. డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, డిప్యూటీ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, యన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ పి. హిల కుమారి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!