జిల్లా జైల్ ను తనిఖీ చేసిన న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
న్యూస్ వెలుగు, కర్నూలు; మంగళవారం పంచలింగాల గ్రామం నందు గల జిల్లా జైల్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఎన్నిరోజులుగా శిక్ష అనుభవిస్తున్నారు, ఏ కేసుల్లో జైల్లో ఉన్నారు తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయ సేవల గురించి తెలియజేశారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైల్ నుండి బయటకు వెళ్ళిన అనంతరం సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఈ కార్యక్రమం లో చీఫ్ లీగల్ అయిడ్ డిఫేన్స్ కౌన్సెల్ యస్.మనోహర్, జిల్లా జైల్ సూపరింటెండెంట్ బి. చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!