
మహాత్ముడిని చంపిన మత ఉన్మాదాన్ని తరిమికొడదాం
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ
కర్నూలు, న్యూస్ వెలుగు; మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నారాయణ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదట మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు మరియు కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఉద్దేశించి నరసింహ ప్రజాశక్తి జిల్లా మేనేజర్ మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, నగేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారత ప్రజలను ఐక్యంగా ఉంచుతే బ్రిటిష్ పరిపాలన నడుపుకోవడం కష్టంగా మారుతుందని గ్రహించి భారతదేశంలో మతఉన్మాదాన్ని మతం పేరుతో ప్రజలను చీల్చడానికి బ్రిటిష్ వాడు కుట్ర చేశాడని ఆ కుట్రలో భాగంగానే బ్రిటిష్ వాడి పెంపుడు కుక్కల్లాగా మతోన్మాద సంస్థలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజలందరిని ఐక్యంగా ఉంచడం కోసం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జాతిని ఐక్యం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనిఆడారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యంగా ఉండి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ప్రపంచంలోనే శాంతియుతంగా కోట్లాదిమందిని ఏకం చేసినా గొప్ప నాయకుడని తెలిపారు. అలాంటి మహాత్మా గాంధీని భారత జాతీయ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిని మత ఉన్మాది గాడ్సే 1948 జనవరి 30న తుపాకితో కాల్చి చంపాడని తెలిపారు. కాల్చింది గాడ్సే అయిన అతను ఆ విధంగా ఉన్మాదంతో తయారవడానికి కారణం ఆర్ఎస్ఎస్ మత ఉన్మాదం అని అన్నారు. నేడు మతోన్మాదుల చేతిలో మన భారతదేశం విలవిలలాడుతుందని అందుకే విద్యార్థులు యువకులు అందరూ ఐక్యంగా ముందుకు కదిలి లౌకిక భారతదేశాన్ని మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణమైన ప్రజలకు విద్యా వైద్యము సేవా రంగంలోనూ భారీగా కార్పొరేటీకరణ పెంచి ప్రజలకు భారంగా మార్చారని ప్రజలు ప్రభుత్వాలపై పోరాడకుండా మతఉన్మాదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఈ మతోన్మాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాము నగర ఉపాధ్యక్షులు అబుబాకర్ తదితరులు పాల్గొన్నారు.