జ్యోతిరావు పూలే ఆశయాలు సాధిద్దాం

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధిద్దాం

న్యూస్ వెలుగు, కర్నూలు; మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని టిడిపి కర్నూలు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ అన్నారుజ్యోతిరావు వర్ధంతి సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు బి.సి సెల్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ తెలుగుదేశంపార్టీ బిసి నాయకులతో కలిసి జ్యోతిరావు పూలె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ… సమాజంలో ఉన్న వర్ణ, కులవివక్షతను రూపుమాపడంలోను, స్త్రీలకు సమానత్వం కల్పించడం లోను, బాల్య వివాహాలను వ్యతిరేకించడం లోను, వితంతువులు పునర్వివాహం చేసుకునడంలోనూ పూలే ప్రోత్సహించారన్నారు. సమాజిక వర్గ విభేదాలను రూపుమాపేందుకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి సమానత్వం కల్పించేందుకు అనునుత్యం పోరాటం చేశారన్నారు. స్త్రీలకు విద్య అవసరం అన్న సత్యం గ్రహించి ముందుగా తన ఇంటి నుండే స్త్రీలకు విద్యాబ్యాసాన్ని నేర్పించేందుకు పూనుకొని వారి సతీమణి సావిత్రిబాయి పూలేతోనే ప్రారంభించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

Author

Was this helpful?

Thanks for your feedback!