బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం; డివైఎఫ్ఐ
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; దేశం కోసం చిన్న వయసులోనే అమరుడైన అస్ఫాఖుల్లాఖాన్ జీవితం స్పూర్తితో ప్రతి ఒక్కరం ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందాం బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.అస్ఫకుల్లాఖాన్ జయంతి ని పురస్కరించుకుని డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఐటిఐ కాలేజి నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచేస్తుంది అన్నారు.ముఖ్యంగా విభజన హామీలు అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది అన్నారు.అందులో ప్రధానమైనది కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా తాస్కరం చేస్తున్నది.వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప ఉక్కుపరిశ్రమ ఏర్పాటు అయితే వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కరువుతో అల్లాడుతున్న రాయలసీమ కు ఉపశమనం లభిస్తుందని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నారు.కానీ కేంద్రం ఇక్కడ ఉక్కు ఏర్పాటు చేయడం లేదు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారు వేసిన శిలాఫలకాలు మారుతున్నాయి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలోని పాలకులు కేంద్రంపై ఒత్తిడి తేలేకున్నాయన్నారు. విభజన హామీల అమలు కోసం ఈనెల 29 30 తేదీలలో రాష్ట్ర కమిటీ సమావేశాలలో కడప ఉక్కు ప్రధాన అజెండాగా చర్చించడం జరుగుతుందన్నారు ఈ సమావేశాలకు అఖిల భారత అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఎంపీ ఏఏ రహీం గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ విజయ్ నాయకులు ఉదయ్ శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.