
కురువలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం…
కురువ సంఘల నాయకులు
కర్నూలు, న్యూస్ వెలుగు; కురువ కులస్తులపై దాడులను అరికట్టాలని కర్నూలు లో కురవ సంఘల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అరికేల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కురవ ఈరన్న ను దారుణంగా హత్య చేశారు. ఈహత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు జిల్లా ఎస్పీ ని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ విషయంలో హత్య జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి కి ఐదు మంది పిల్లలు ఉన్నందున వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. హత్య చేసిన వారిని వెంటనే గుర్తించి ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో
బత్తిన కిరణ్ కుమార్, రాయలసీమ రవికుమార్, శ్రీనివాసులు, తిరుమలేష్, లాలి,మహేంద్ర, లక్ష్మీ నారాయణ,పర్ల శేఖర్, వెంకట రాముడు, మురళి మోహన్, శివ లింగం, శివ నారయణ, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.