పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం ..!

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం ..!

శ్రీ సత్య సాయి జిల్లా : పుట్టపర్తి నగరంలోని సాయి గీత పాఠశాల యందు అమ్మ కోసం మొక్క అన్న కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ జిల్లాలో వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండి, పుష్కలంగా జీవించాలంటే చెట్లు మొక్కలు అడవులను కాపాడుకోవాలని, విద్యార్థుల చేత నినాదాలు చేయించారు. అలాగే విద్యార్థులు మేధాసంపత్తిని ఎలా పెంచుకోవాలి అన్న ప్రధాన అంశాన్ని రెండు ఆసనాల ద్వారా వారు చూపించి చేయించారు. ఇది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినాన్ని పురస్కరించుకొని మొక్కలు విరివిగా నాటాలని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సాయి గీత హెడ్మాస్టర్ ఉదయ్ భాస్కర్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!