మద్యం దుకాణాలు  ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలి 

మద్యం దుకాణాలు  ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలి 

రాజుపాలెం, న్యూస్ వెలుగు; గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండాలని ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ఊరికి దూరంగా ఉండాలని నిబంధనలు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రభుత్వ దుకాణాలను రద్దుచేసి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. లైసెన్స్ దక్కించుకున్న వారు అధికార పార్టీ అండతో నివాసాల మధ్య ఆలయాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారంటూ మండల కేంద్రమైన రాజుపాలెం ప్రజలు ఆర్ఆర్ సెంటర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపుకు కూతంతా దూరంగా విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ పాఠశాలలు, ప్రజలు నిత్యం పూజించే దేవాలయాలు ఉన్నాయనినివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే మహిళలకు విద్యార్థులకు రక్షణ కరువు అవుతుందని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ వైన్ షాప్ పెట్టాలని చూస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు. వైన్ షాప్ పెడితే దీనివల్ల మహిళలు ఇబ్బందులు గురవుతారని పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పోకిరిలు వేధింపులు పెరిగి అవకాశం ఉందని మద్యం సేవించిన మత్తులో ఇళ్లలో చొరబడతారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్పిన ముడుపుల మత్తులో పట్టించుకోవటం లేదని.. స్థానిక ప్రజా ప్రతినిధులు వాటాలం మత్తులో పట్టి పట్టనట్టు ఉంటున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇళ్ల మధ్య వైన్ షాపును తొలగించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు…

Author

Was this helpful?

Thanks for your feedback!