మహా శివరాత్రి పాంచాహ్నికదీక్షాపూర్వక క్రతువులు ప్రారంభం

మహా శివరాత్రి పాంచాహ్నికదీక్షాపూర్వక క్రతువులు ప్రారంభం

విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 24.02.2025 నుండి 28.02.2025 వరకు ఇంద్రకీలాద్రి పై శ్రీ క్రోధి నామ సంవత్సర మహాశివరాత్రి ఉత్సవములను పురస్కరించుకొని మొదటి రోజైన సోమవారం ( ఫిబ్రవరి 24న )పాంచాహ్నికదీక్షా పూర్వక క్రతువులు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం లో ప్రారంభమైనవి. ఉదయం 9 గంటల నుండి శ్రీ గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు మంగళ స్నానములు జరిపించి,ఆలయ అర్చకులు వధూవరులుగా అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా దేవ దేవేరిలకు దేవస్థానం నుండి అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటలనుండి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూల మంత్రహవనములు, బలి హరణ, హారతి, మంత్రపుష్పం జరుగగా, తీర్థ ప్రసాద వినియోగంతో మొదటి రోజు పూజా క్రతువులు ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాదశర్మ,ప్రధాన అర్చకులు వై.మల్లేశ్వర శాస్త్రి,ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. రత్నరాజు, సహాయకార్యనిర్వహణాధికారి ఎం. దుర్గారావు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!