
గొప్ప మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే
ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బడిగింజల విజయలక్ష్మి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; మహాత్మా జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న పులే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్(లేపాక్షి) మాజీ చైర్ పర్సన్ శ్రీమతి బడిగించల విజయలక్ష్మి మరియు బడిగించల చంద్రమౌళి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతాధి జ్యోతి రావు పూలే అని కొనియాడారు.బలహీన వర్గాలకు చట్ట సభలలో, స్థానిక సంస్థలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రధాన పార్టీలు బిసిలకు50 శాతం సీట్లు ఇచ్చి చట్ట సభలకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బడుగు బలహీన మైనారిటీలు పాల్గొన్నారు.