
హాకీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ కు ఎంపికైన మహేష్
సన్మానించిన ప్రముఖ న్యాయవాది క్రీడాదాత జి శ్రీధర్ రెడ్డి
కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక కర్నూల్ డి ఎస్ ఏ అవుట్డోర్ స్టేడియం నందు సన్మాన కార్యక్రమంలో హాకీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆంధ్ర ప్రదేశ్ జట్టు తరఫున కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కురువ మహేష్ ఎంపికైన సందర్భంగా ప్రముఖ న్యాయవాది క్రీడా దాత జి. శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ కాకినాడ డి.ఎస్.ఎ స్టేడియం నిర్వహిస్తున్న జాతీయస్థాయి హాకీ సివిల్ సర్వీసెస్ పోటీల్లో మన కర్నూలు జిల్లా వాసి ఎంపికైన సందర్భంగా కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మహేష్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ శిక్షకుడు మహేశ్వర రావు కర్నూలు జిల్లా నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు కొండేపోగు చిన్న సుంకన్న శేషుపని తదితరులు పాల్గొన్నారు.