మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ; డివైఎఫ్ఐ
కడప, న్యూస్ వెలుగు; ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 28.11.2022 న 6100 ఉద్యోగాలకు విడుదల చేశారు క్వాలిఫై అయినా అభ్యర్థులకు వెంటనే హోంగార్డుల రిజర్వేషన్ కేసును పూర్తిచేసి ఫిజికల్ ఈవెంట్స్, మైన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం.చిన్ని,వీరనాల. శివకుమార్ లు తెలిపారు. శుక్రవారం నాడు కడప ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు వె
ఏపీఎస్పీ లో 8 నుండి 15 శాతము, సివిల్ 15 నుండి 25 శాతము పెంచడం వల్ల ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోలీస్ బోర్డు హైకోర్టుకు వెళ్ళింది అక్కడినుండి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఓకే పెండింగ్ లో ఉంది. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుతం పడిన కూటమి ప్రభుత్వం కానీ కేస్ పైన ఒక్క హియరింగ్ కి కూడా హాజరవ్వకుండా అభ్యర్థులకు హోంగార్లకు మధ్య తగాదాగా మార్చి ప్రభుత్వమే రెండు సైడ్లు ఉంటూ కాలయాపన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కేవలం 300మంది క్వాలిఫై అయ్యారు. ఆ లెక్కన 40% రిజర్వేషన్లు వారికి కేటాయిస్తే 2400 ఉద్యోగాలు వారి కోట కింద వస్తాయి. కనీసం క్వాలిఫై కాకుండానే వారికి ఎలా ఉద్యోగం ఇవ్వాలనుకుంటుందో ప్రభుత్వం అర్థం కావట్లేదని తెలిపారు. గతంలో ఉన్న రిజర్వేషన్లనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో ఈ ప్రక్రియని పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19913 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం పని చేసే పోలీసుల పైన పని భారం ఒత్తిడి పెరిగిందని అసెంబ్లీలో హోం మంత్రి ప్రకటించింది. వాస్తవ పరిస్థితుల్లో పోలీస్ నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ప్రతిరోజు వ్యాయమం చేయడం, హాస్టలు, స్టడీ హాల్స్ కు వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది దీంతో ఆర్థికంగా మానసికంగా చితికిపోయారని తెలిపారు. అమ్మాయిల పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని ఇందులో ఒంటరి మహిళల పిల్లలు వారి తల్లిలు కష్టపడి కూలి నాళీ చేసి డబ్బు పంపితే చదువుకునే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది ఒకవైపు పెళ్లిళ్లు, మరోవైపు ఎన్ని రోజులు చదువుతారు నీకు ఉద్యోగాలు రావు వచ్చేయండి అని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వల్ల మరింత ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కేసును పరిష్కారం చేసి, ఫిజికల్ ఈవెంట్స్ మైన్స్ ఎగ్జామ్ నిర్వహించి డిసెంబర్ లోపు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన 95,208 మంది రోడ్ల పైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ విజయ్ జిల్లా సహాయ కార్యదర్శి అంజి, బాల గురయ్యా తదితరులు పాల్గొన్నారు.