
సర్వ దోష నివారణార్థం శాంతి హోమం నిర్వహణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ దేవాలయములలో శాంతి హోమములు నిర్వహించుటలో భాగముగా గురువారం ఉదయం దేవస్థానం లోని చండీ యాగశాల నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానం నందు శుద్ధి కొరకు కార్యక్రమములు నిర్వహించబడునని, ఇటీవలే దేవస్థానంలో పవిత్రోత్సవములు నిర్వహించడం జరిగినదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు సర్వ పదార్థముల దోషములు అన్ని నివారణ అయ్యి, శాంతి పొందుటకు మరియు రాష్ట్రం సుభిక్షముగా ఉండాలన్న సత్ సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రి పై అమ్మలగన్నయమ్మ, జగన్మాత సన్నిధిలో గురువారం శాంతి హోమం నిర్వహించడం జరిగినదని తెలిపారు.