మహర్షి వాల్మీకి జయంతిని విజయవంతం చేయండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి కుల పెద్దలు,యువ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన రామాయణం సృష్టికర్త మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించుకుని….మండల కేంద్రంలో నిర్వహించే మహర్షి వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాల్మీకి సహోదరులు,వాల్మీకి కుల బాంధవులు మరియు కుల మతాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు సింధువాళం కృష్ణయ్య,తోక వెంకటేష్,లక్ష్మన్న,బకాడి శంకర్, తుంబలం సిద్ధప్ప,పెద్దహ్యట శ్రీరంగ,దిడ్డి తిక్కస్వామి,రారాయి సిద్దు,గోవిందు,తిక్కప్ప,బిజీ.హళ్లి రమేష్,వెంకటేష్,కృష్ణ,వెంకీమల్లి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!