
25న కర్నూలు లో జరిగే దళిత సభను విజయవంతం చేయండి
పత్తికొండ న్యూస్ వెలుగు : రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఫిబ్రవరి 25వ తేదీన కర్నూల్ నగరంలో అంబేద్కర్ భవనం నందు జరిగే దళిత మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేష్,మాదిగ జిల్లా అధ్యక్షులు బురుజుల పులికొండ పిలుపునిచ్చారు. సోమవారం ఎంఆర్పిఎస్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోయి చంపడం దారుణమని తీవ్రంగా ఖండించారు.కావున రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను చంపిన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ముద్దాయిలకు ఉరి శిక్ష పడే విధంగా అధికారుల చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బొంతల నరసింహులు.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!

