జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి

జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి

జమ్మలమడుగు (న్యూస్ వెలుగు )  :ఆగస్టు 7, 8 తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్న ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా నాయకులు గండి సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని స్థానిక సాయి పరమేశ్వర కళాశాల లో విద్యార్థులతో కలిసి జిల్లా ప్లీనరీ సమావేశం కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెంబర్ 117, 77 లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మూసివేసిన సంక్షేమ హాస్టల్స్ ని వెంటనే తిరిగి ప్రారంభించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్నారు. గత ప్రభుత్వం హాయాంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయిన ప్రభుత్వ విద్యారంగాన్ని కాయపాడాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.  ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం రాబోవు రోజుల్లో పోరాటాలు చేసేందుకు ఆగస్టు 7, 8 తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్న ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షరీఫ్, రఫీ, సలీం, నూర్ మహ్మద్, అభినయ్ లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!