
లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
హోళగుంద,న్యూస్ వెలుగు: హలో మాదిగ చలో హైదరాబాద్ లక్ష డబ్బులు వెయ్యి గొంతులు వర్గీకరణ ఆశయా సాధనకై పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ భీమన్న ఆధ్వర్యంలో మంగళవారం మాదిగ కుల బాంధవులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వర్గీకరణ సాధనకై పెద్దఎత్తున 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని ప్రతి గ్రామం,ప్రతి ఇంటి,ప్రతి మాదిగ సోదరులందరూ డప్పుతో వచ్చి ప్రపంచానికి మన డప్పు శబ్దం ద్వారా మన ఆవేదన,మన ఆకాంక్ష,వర్గీకరణ ఆశయాల సాధనకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి మాదిగ కుల బాంధవులు సిహెచ్ శేషగిరి,చిదానంద,దేవప్ప,పకీరప్ప,మల్లికార్జున,కేంచప్ప, వెంకటేష్,గోవర్ధన,పల్లి ఈరన్న,మహేష్, గోవిందు,చిదానంద,రమేష్, దేవేంద్ర,కృష్ణ,ఉలేష్,యోహన్, శివలింగ,ఆంజనేయ,మారేష్, తదితరులు పాల్గొన్నారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda