ఎన్.యు.జె జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయండి

ఎన్.యు.జె జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయండి

జాప్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్,జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి; విజయవాడ క్లబ్ లో  డిసెంబర్ 11,12 తేదీలో జరిగే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్.యు.జె) జాతీయ కార్యవర్గ సమావేశలను విజయవంతం చేయాలని జాప్ యూనియన్ కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, జిల్లా అధ్యక్షుడు తుగ్గలి శ్రీనివాస గౌడ్ లు పిలుపునిచ్చారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో పెద్ద యూనియన్ గా దశాబ్దాలుగా పాత్రికేయుల సంక్షేమం కోసం పనిచేస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాలు డిసెంబర్ 11,12 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయని,ఎన్.యూ.జే కు అనుబంధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) వీటిని నిర్వహిస్తుందని తెలిపారు.జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.వి.ఎస్.ఆర్ పున్నంరాజు,ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్ రెడ్డి ల సారధ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.డిసెంబర్ 11వ తేదీ ఉదయం 10:30 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ వారధి పక్కనే ఉన్న విజయవాడ క్లబ్ లో జరిగే ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కే.రఘురామకృష్ణం రాజు ముఖ్యఅతిథిగా హాజరవుతారని, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కే.పార్థసారథి ప్రధాన ఉపన్యాసం చేస్తారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్,బిజెపి పక్ష నేత పి.విష్ణుకుమార్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.రాష్ట్ర ఎన్జీవో నేత ఏ విద్యాసాగర్,ఎన్.యూ.జే అధ్యక్షులు రాస్ బిహారి,ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తివారీ,కోశాధికారి అరవింద్ సింగ్,జాతీయ ఉపాధ్యక్షులు శివకుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి తీర్మానాలు చేస్తారని జాబ్ యూనియన్ గౌరవాధ్యక్షులు అబ్దుల్ సత్తార్,జిల్లా అధ్యక్షులు తుగ్గలి శ్రీనివాస్ గౌడులు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!