ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలో శనగ

విత్తనాల రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియ, గ్రామంలో సాగుచేసిన కొర్ర,పత్తి పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు అందించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల కొర్ర పంటలో ,పత్తి పంటలో పల్లపు (తగ్గు) ఉన్న ప్రాంతాల్లో నీరు నిలబడిందని ఇట్లాంటి పరిస్థితులు ఉన్న రైతులు తమ పొలాల్లో నీటిని బయటికి పోయే విధంగా మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఎక్కడైనా తగ్గు ప్రాంతంలో నీరు నిలవడం వలన కొర్ర కంకులు నీటిలో తడసి మోసులు, మొలకలు రావడం జరుగుతుందని అలాంటి రైతులు తక్షణమే నీటిని బయటకు పంపించాలని సూచించారు .అలాగే మినుము పంట సాగు చేసిన రైతులు తగ్గు ప్రాంతాల్లో నీరు నిలబడి ఉంటే మురుగునీరు బయటకు పంపే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.నీరు నిలబడి ఎక్కువ రోజులు పంటలో అలాగే నిల్వ ఉంటే ఎర్రగా మారి చనిపోయే ప్రమాదం ఉంది అని తెలిపారు.మండలంలో ఈ రోజు 41.6 యమ్.యమ్. వర్షపాతం నమోదయింది అని తెలిపారు. ఖరీఫ్లో సాగు చేసి ఎండు ముఖం పట్టిన ప్రత్తి,కంది,జొన్న,కొర్ర పంటలకు ఈ వర్షం ఎంత గానో ఊరట నిచ్చింది అని రైతులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు.పంటల్లో పచ్చదనం బాగా కనిపిస్తూ, కంది ,ప్రత్తి పంటలకు చాలా ఉపయోగకరమైన వర్షం అని తెలిపారు.అలాగే గ్రామంలో శనగ విత్తనాలు కావాల్సిన రైతులు ఈ రోజు, రేపు,రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.రైతులు శనగ విత్తనము సాగు చేయుటకు మంచి వర్షం సకాలంలో పడటం వలన ఆనందం వ్యక్తం చేసినారు.ప్రతి రైతు విత్తనం సాగు చేసే సమయంలో తప్పనిసరిగా విత్తనశుద్ది చేసుకోవాలని తెలిపారు.అలాగే పంట మార్పిడి తప్పనిసరిగా అవలంబించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో వి.ఏ.ఏ, పవన్ కుమార్ గ్రామ రైతులు నారాయణరెడ్డి, శుశాంత్ రెడ్డి,బాబుల్ రెడ్డి,శంకర్ తదితర రైతులు పాల్గొన్నారు.
Thanks for your feedback!