13న మండల సర్వసభ్య సమావేశం ; ఎంపీడీవో విశ్వ మోహన్

13న మండల సర్వసభ్య సమావేశం ; ఎంపీడీవో విశ్వ మోహన్

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు నవంబర్ 13న మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు. బుధవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎర్ర నాగప్ప ఆధ్వర్యంలో నవంబర్13 బుధవారం రోజున ఉదయం 11:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు,ఎంపీటీసీలు,  ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని,అదేవిధంగా మండల స్థాయి అధికారులు తమ నివేదికలతో సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!