హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మండల స్థాయి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖలతో ఖరీఫ్ కార్యాచరణ

ప్రణాళిక 2025 – 26 రైతు సాధికార సంస్థ – ప్రకృతి వ్యవసాయం పై మండల స్థాయి సమన్వయ సమావేశాన్ని మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్,ఏపీఎం సూర్య ప్రకాష్ అధ్యక్షతన మంగళవారం మహిళా మండల సమైక్య హాల్ నందు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమావేశనికి వచ్చిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ సంస్థల అధికారులు ఏఈఓ,సీసీ,వీఓఏ, వీఓబి,రేవన్న ఎల్1 ఎల్3 లతో సమావేశంలో తెలిపారు.ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం కోసం గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను ఆర్ఎస్కెల కార్యకర్తల సమన్వయంతో,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాల మహిళలతో ఖరీఫ్ ప్రణాళికను పూర్తి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పేలాటైజేషన్ విత్తన గుళికలు డెమో చేసి చూపించడం జరిగింది.అదేవిధంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికకు సహకరిస్తామన్నారు.
Thanks for your feedback!