
టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల టీడీపీ నాయకులు
* టీడీపీ పార్టీ సభ్యత్వం రేపటి భవితకు ఆదర్శం
* మండల అధ్యక్షుడు ఆర్.తిరుపాల్ నాయుడు.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని గల బొందిమడుగుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాంపల్లి తిరుపాల్ నాయుడు సమక్షంలో బొందిమడుగుల గ్రామపంచాయతీ సర్పంచ్ యండ చౌడప్ప,గ్రామ సర్పంచ్ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ ఆధ్వర్యంలో తుగ్గలి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం రోజున ఘనంగా ప్రారభించారు.ఈ సందర్బంగా తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు,టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వం రేపటి బంగారు భవిష్యత్ కు ఆదర్శమని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో టీడీపీ నాయకుల,కార్యకర్తల సంక్షేమం కోసం 2024 నుంచి 2026 టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని,పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అనుకోని సంఘటనలలో ఏదైనా ప్రమాధం జరిగినపుడు పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి భీమా వర్తించి,కుటుంబ సభ్యులు ఆర్థికంగా వెసులుబాటుకు కోదువ ఉండకూడదని,వంద రూపాయలు కట్టి టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు భీమా వర్తించిన వారు అకాల మరణం చెందినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 5లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థికంగా పార్టీ నాయకత్వం పూర్తి భాద్యత వహిస్తుందని వారు తెలియజేశారు. గ్రామాలలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు వారి కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా,పురుషులు తప్పకుండ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాతన గ్రామ మాజీ సర్పంచ్ మనోహర్ చౌదరి,టీడీపీ తెలుగుమహిళా అధ్యక్షురాలు రాతన ఈరమ్మ,ఎద్దులదొడ్డి యూనిట్ ఇంచార్జ్ శ్రీనివాసులు గౌడ్,తెలుగు రైతు అధ్యక్షులు రాతన మైరాముడు, రాంకొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మసాలా, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు,నునుసరాళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ రంగారెడ్డి,నల్లగుండ్ల కుషినేని రవి కుమార్,ఈ.మునేశ్వర గౌడ్, మామిళ్లకుంట యడవలి తిమ్మప్ప, ఆర్.ఎస్ పెండేకల్ టీడీపీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ బాషా, నునుసరాళ్ళ టీడీపీ నాయకులు రామాంజినేయులు,ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ గౌడ్,వెంకటరాముడు,పెండేకల్ ఆర్.ఎస్ రామచంద్రుడు,బొగ్గుల బ్రహ్మయ్య,రాంకొండ గ్రామ టీడీపీ కార్యకర్తలు బిప్రసాద్,ఐటీడీపీ నాగరాజు,బొందిమడుగుల గ్రామ టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఉసేన్, చిన్న ఉసేన్,ధనంజయ,లక్ష్మీ నారాయణ,ఉదయ,వినోద్,రవికుమార్, ఇస్మాయిల్,నాగరాజు,లక్ష్మణ స్వామి మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.