
మాజీ సీఎం వైయస్ జగన్ ని కలిసిన మండల వైసిపి నాయకులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం రాత్రి విజయవాడలో మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు వైసీపీ సీనియర్ నాయకులు తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి,వైసిపి సీనియర్ నాయకులు రాతన మోహన్ రెడ్డి వైసిపి యువ నాయకుడు తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి లు పుష్పగుచ్చాన్ని అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అని ఆయన తెలియజేశారు.వైసిపి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల ఎవరో భయపడవద్దని, ప్రతి కార్యకర్తకు,నాయకునికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు తెలిపి భరోసాను కల్పించారని తెలియజేశారు.అలాగే నియోజవర్గంలో ఉన్న పలు సమస్యలను తాము మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినట్లు వారు పాత్రికేయులకు తెలియజేశారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu