
నారాయణలో మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ పోటీలు
న్యూస్ వెలుగు కర్నూలు; వేగవంతమైన పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అంశాలు తప్పనిసరిగా అవసరమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు సూచించారు. స్థానిక ఎలుకూరు బంగ్లా ఆవరణలోని నారాయణ పాఠశాలలో శనివారం మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ పోటీలు ఘనంగా జరిగాయి. ముందుగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వకృత్వ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు విభిన్న నైపుణ్యాలను అలవార్చుకోవాలని సూచించారు.
కొత్త విషయాలను
ఎప్పటికప్పుడు సాధన చేస్తే సబ్జెక్టు పై అవగాహన పెంచుకుని మరింతగా
నైపుణ్యాలు సాధిస్తారని అన్నారు. ప్రస్తుతం వేదికలపై నిలబడి మాట్లాడడానికి భయపడుతున్న తరుణంలో నారాయణ విద్యాసంస్థలు ఇలాంటి పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని, విద్యార్థులకు ఇలాంటి పోటీలు జరపడం వల్ల భాషా పరిజ్ఞానం, కొత్త అంశాలపై అధ్యయనం చేయడానికి సులభం అవుతుందన్నారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న భావాలను వేదికపై వ్యక్తం చేశారు. పోటీలలో భాగంగా విద్యార్థుల
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఆర్ & డి విభాగాదిపతులు నరేష్, భారతి, రుప్కోస్, ఏ జి యం రమేష్ కుమార్, అన్వర్ బాషా, రామాంజనేయులు, క్లస్టర్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్స్, సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్, కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.