
గొర్రెలు,మేకలకు వైద్య శిబిరం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని బొమ్మగుండనహళ్లి గ్రామంలో గురువారం రిలయన్స్ ఫౌండేషన్ ఆర్డిప్ స్వచ్చంధ సంస్థల మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్లు కార్తీక్,జిలాన్ మాట్లాడుతూ మన దేశం వ్యవసాయంతో పాటు పశు పోషణలో కూడ అభివృద్ధి సాదించాలని మరియు మన యొక్క జీవనోపాదులు కూడా పెంచుకోవాలని కోరారు.అదేవిధంగా ప్రస్తుతం గొర్రెలకు,మేకలకు రోగ నిరోధక శక్తి తగ్గి,జ్వరం,దగ్గు,సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.ఈ పరిస్థితిలను దృష్టిలో ఉంచుకోని ముందుగానే రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆర్థిప్ సంస్థ అవగాహన మరియు శిక్షణలు ఏర్పాటు చేసి మెలకువలు,జాగ్రత్తలు తెలియజేస్తున్నారని తెలిపారు.రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉచితంగా ఇదివరకే దాన పంపిణీ చేయడం జరిగిందని ఆర్థిప్ సంస్థ కార్యకర్త నాగరాజు చెప్పారు.మరియు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 18004198800 నెంబర్ కు సంప్రదించాలన్నారు.ప్రస్తుతం గొర్రెలకు,మేకలకు గాలికుంటు జ్వరము,దగ్గు,నీరసము మేత భాగ మేయటానికి మందులు,ఇంజక్షన్ వేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ శేఖర్,వనికేరప్ప,రైతులు తదితరులు పాల్గొన్నారు.