కేఎంసీలో ఘనంగా వైద్య విజ్ఞాన సదస్సు పూర్వ విద్యార్థుల సమ్మేళనం”..

కేఎంసీలో ఘనంగా వైద్య విజ్ఞాన సదస్సు పూర్వ విద్యార్థుల సమ్మేళనం”..

కర్నూల్, న్యూస్ వెలుగు;  మెడికల్ కాలేజీ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం అని ఎందుకంటే నా రాజకీయ జీవితానికి పునాదిరాళ్లు ఇక్కడే పడ్డాయి అని మాజీ పార్లమెంటేరియన్ & మాజీ మంత్రి యం.వి. మైసూరారెడ్డి అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో కర్నూల్ మెడికల్ కాలేజీ అల్యూమిని అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ కుమారస్వామి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన సదస్సు మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ఆయన మాట్లాడుతూ 1966లో ఈ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించానని అప్పట్లో విద్యార్థి దశలో ఈ కాలేజీ లోనే నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడం జరిగిందని హౌస్ సర్జన్ విభాగంలో జనరల్ సెక్రటరీగా పని చేయడం జరిగిందని, పేద ప్రజల ఎడల ఎలా ప్రవర్తించాలి, వారి కష్టాలు ఏంటి అన్నది ఈ మెడికల్ కాలేజీ విద్యార్థి దశలోనే నేర్చుకోవడం జరిగిందని అందుకనే రాజకీయ రంగంలో రాణించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర రిటైర్డ్ డిజిపి డాక్టర్ డిటి నాయక్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా చారిత్రకంగా పౌరాణికంగా, సంస్కృతి పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని కర్నూలు మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో రాణించడం ఇటీవల డాక్టర్ నాగేశ్వర రావ్ గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం రాజకీయ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయిలో పదవులు అలరించడం జరిగిందని ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సౌమ్యులని ఏ విషయం అయినా ఓపెన్ గా మాట్లాడుతారని అన్నారు.. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ పి గురు రాజా గారు మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యతోపాటు వ్యక్తిత్వ విషయంలో ఎంతో నేర్చుకున్నానని, మానవత్వం అంటే ఏంటో ఇక్కడ పేద ప్రజలకు సేవలందించడం ద్వారా అర్థమైందని అన్నారు. కేఎంసి వైద్య విద్యలో స్నేహితుల ద్వారా ఎంతో నేర్చుకోవడం జరిగిందని అందువల్లనే కర్నూలు మెడికల్ కాలేజ్ ని ఎప్పటికీ మరువలేమని అమెరికాలో సైతం ప్రజలకు సేవలు అందిస్తున్నామంటే ఇక్కడ నేర్చుకున్న మానవత్వ విలువలేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డాక్టర్ ఐ రమేష్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ విక్రమసింహారెడ్డి డాక్టర్ నరసింహులు డాక్టర్ మహేశ్వర్ రెడ్డి డాక్టర్ బాల మద్దయ్య, డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ గోవిందరెడ్డి, అమెరికా లో స్థిర పడిన డా.సదా శివ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతి కల వివిధ ప్రదేశాల నుంచి దాదాపు 800 మంది పైగా పూర్వ విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!