మెడికవర్ హాస్పిటల్ ను సీజ్ చేయాలి

మెడికవర్ హాస్పిటల్ ను సీజ్ చేయాలి

          కలెక్టరు ను సిపిఐ నాయకులు

కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ లోని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ని కలిసి మెడికవర్ హాస్పిటల్ ను సీజ్ చేయాలని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది కలిసిన వారిలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం గారు సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు అన్వర్ మహేష్ తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నరు కలెక్టర్ కి వివరిస్తూ కర్నూల్ లోని మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫీజుల దోపిడీలను అరికట్టాలని డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకుని మనుషుల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారని ఈ మధ్యకాలంలో చాలామంది పేద రోగులు దగ్గర నుండి లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకొని శవాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల పైన యాజమాన్యమైన మహేశ్వర్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇప్పటిదాకా ఆరోగ్య శ్రీ కి సంబంధించిన కేసులపైన సమగ్రమైనటువంటి విచారణ చేయించాలని ఆరోగ్య శ్రీ లో అనేక అవకతవకలు జరిగాయని స్థానికంగా మెడికవర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్న ఆరోగ్యశ్రీ మెడికల్ అధికారులు స్పందించకపోవడం చాలా శోచనీయమని గత మూడు రోజుల క్రితం జిల్లామెడికల్ ఆరోగ్య శాఖ అధికారి ఆఫీస్ దగ్గర ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చిన ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని మెడికల్ అధికారులు ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఉన్నారా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యానికి తొత్తులుగా ఉన్నారని ప్రజలు ఒకసారి ఆలోచన చెయ్యాలని వారన్నారు అలాగే హాస్పిటల్లో మెడికల్ స్టోర్లో అమ్మే మందులన్నీ కూడా నాసిరక నకిలీ మందులని వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించి చెస్ట్ చేయించాలని మెడికవర్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకునే వరకు యాజమాన్యం పైన కేసులు పెట్టేవరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తానే ఉంటామని వారన్నారు .
కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే త్రీ మాన్ కమిటీ వేసి విచారణ చేయిస్తామని
డిఎం& హెచ్ ఓ పిలిసి త్రీ మ్యాన్ కమిటీ వేసి విచారణ చేయించాలని రిపోర్టును ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడం జరిగినది.

Was this helpful?

Thanks for your feedback!