శ్రీశైలంలో అన్నదానం ప్రారంభించిన కురువ సత్రం కమిటీ సభ్యులు

శ్రీశైలంలో అన్నదానం ప్రారంభించిన కురువ సత్రం కమిటీ సభ్యులు

శ్రీశైలం, న్యూస్మవెలుగు: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ శ్రీ శ్రీ అఖిలభారత కురువంశ నిత్యాన్న దాన సత్రం కమిటీ నిర్వాహకులు అధ్యక్షులు ఎంకే రంగస్వామి, ప్రధాన కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పర్ల శ్రీనివాసులు, సభ్యులు కేసి నాగన్న, కె నాగశేషులు, జి శివన్న, వెంకటేశ్వర్లు, లు గురువారం నాడు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదు రోజులు నిర్వహించే ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని పర్ల గ్రామానికి చెందిన మల్లికార్జున, నాగన్న, రాముడు ,బృందం వారు అన్నదానం కోసం ఎంతో సహకరించాలని వారు తెలిపారు. అలాగే మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన కే. దేవరెడ్డి ఈ అన్నదా

న కార్యక్రమానికి సహకరించాలని వారు తెలిపారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తాదులకు శ్రీశ్రీశ్రీ అఖిలభారత కురువంశ నిత్యాన్నదాన సత్రంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్రం కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎంకే రంగస్వామి, ప్రధాన కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పర్ల శ్రీనివాసులు, సభ్యులు కేసి నాగన్న ,కె నాగశేషులు, జి శివన్న ,వెంకటేశ్వర్ల, తో పాటు కురువ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు పాపారాయుడు, సత్రం సభ్యులు తిమ్మయ్య, హరికృష్ణ, సుబ్బయ్య,మరియు కురువ కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS