
మిలాద్-ఉన్ -నబి పండుగ వేడుకలు
ఆత్మకూరు, న్యూస్ వెలుగు ; ఆత్మకూరు పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని సంత మార్కెట్ సమీపంలో గల ఆసర్ మసీదులో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మహమ్మద్ ప్రవక్త కేశ దర్శన భాగ్యం పట్టణ ప్రజలకు కల్పించారు. పట్టణ ప్రజలు ఆసార్ మసీదు కు వచ్చి మహమ్మద్ ప్రవక్త కేశ దర్శనం భక్తిశ్రద్ధలతో చేసుకున్నరు .మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి ,ధర్మం, న్యాయం,అహింస మార్గంలో ప్రజలు నడవాలని సూచించారని ప్రజలందరూ ఆయన మార్గంలోని నడవాలని మత పెద్దలు తెలిపారు. మహమ్మద్ ప్రవర్త జన్మదినం సందర్భంగా అసార్ మసీదులో కమిటీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తవల్లి హాజీరహంతుల్లా, ఆసార్ సయ్యద్ మాలిక్, హాజీ సుల్తాన్, ఖదీర్, సలాం భాష, సోసైటి హజి ఖాదర్, గౌస్ ఫిరా, మహమ్మద్ గౌస్ మౌలానా, ఖలీద్ మౌలానా ,సజ్జద్, కలీముల్లా,హఙీ మాలిక్, అమ్రుల్లా, హబీబ్ ,దస్తగిర్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.