కేంద్ర మంత్రి హెచ్.డీ కుమార స్వామితో మంత్రి టీజీ భరత్ భేటీ
న్యూస్ వెలుగు, కర్నూలు; కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమార స్వామి, ఉక్కు శాఖ కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్‌కు ఐరన్ ఖనిజం సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించినట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ ఒప్పందం సులభతరం చేయడంలో సహకరించినందుకు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార్ స్వామికి.. భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి డైనమిక్ నాయకత్వానికి, దార్శనికతకు ఈ ప్రగతి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా కృషి చేస్తామని టీజీ భరత్ చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!