
అరచేతిలో అద్భుత వైద్యం
* పున:శక్తితో శరీరానికి పూర్తిస్థాయి ఆరోగ్యం
* ఆక్యుతెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్
విజయవాడ, న్యూస్ వెలుగు; రుగ్మతలతో మంచం పట్టిన వారికి కూడా పునశక్తి వంతులను చేసి శరీరానికి పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని
ఇవ్వవచ్చునని, పురాతన వైద్యంతో మన పెద్దలు ఆయుష్షును పెంచుకున్నారని ఆక్యుతెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ అన్నారు. ఆక్యు ప్రెషర్ వైద్యం శరీరానికి పున:శక్తి ఆచరణ పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి మాట్లాడుతూ యంత్రాలు వినియోగంతో మనుషులకు నేడు జీవితం సుఖమయమైందన్నారు. మన పూర్వీకులు శరీర శక్తిపై ఆధారపడి అన్ని పనులను చక్కబెట్టావారనీ తెలిపారు. ఎప్పుడైతే యంత్రాల మీద ఆధారపడ్డాము, అప్పటి నుంచి పెద్దలు చెప్పిన మాటలను అనుసరించి చిన్న పద్ధతులను వదిలేసామన్నారు. దీనితో శరీరంలో దాగి ఉన్న శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారని తెలిపారు. ఆక్యు ప్రెజర్ వైద్యం శరీరంలో శక్తి ఉత్పత్తి కేంద్రాలను ఉత్తేజం చేస్తుందని, అలసిన శరీరానికి తిరిగి శక్తి అందిస్తుందని తెలిపారు. మనకి అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ, శరీర తత్వానికి తగిన విధంగా నాడీ కేంద్రాలను ఉత్తేజం చేయడం ద్వారా పునః శక్తి వినియోగం జరుగుతుందని తెలిపారు. రుగ్మతాలతో బాధపడేవారు సమస్యలకు పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు.