
త్రాగునీటి పైపు లైన్ ధ్వంసం : పరిశీలించిన టీడీపి నేతలు
కర్నూలు : కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో తాగునీటి ట్యాంకు పైపులైన్ ని  అగంతకులు  ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తాగునీటికి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
 
  
 
పైపులైను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని గ్రామ టిడిపి నాయకుడు బి వి జి మస్తాన్ పరిశీలించి తాగునీటి పైపులైను ధ్వంసం చేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్, టిడిపి నాయకులు బీవీజీ మస్తాన్, నెరవాటి విజయ్ కుమార్, మస్తాన్, మధు, జనసేన నాయకులు శివ నాయుడు, బి వి జి సతీష్ కుమార్, పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ధ్వంసం చేసిన వారిపై వెంటనే చట్టపకారం కఠిన చర్యలు తీసుకోవాలని వాటి ఖర్చులను వసూలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని టిడిపి, జనసేన నేతలు డిమాండ్ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu