రిసెర్వేలో పొరపాట్లు లను గ్రామ సభలో పరిష్కరించబడును
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం తాసిల్దార్ సతీష్ కుమార్ సర్వే డిప్యూటీ తహశీల్దార్ ముకుంద రావు పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టరు అదేశాల మేరకు తేది:-18.10.2024 నుండి 26.10.2024 వరకు హోళగుంద మండలములోని రీ సర్వే జరిగిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ గ్రామ సభలో రీ సర్వేలో జరిగిన పొరపాట్ల పై రైతుల నుంచి అర్జీలను తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే గ్రామానికి సంబందించిన రికార్డులన్నియు తీసుకొని,గ్రామ సభ జరిగే నాడు హాజరు కావలసిందిగా తెలియజేస్తూ,అదేవిధంగా రైతుల సమస్యలను గ్రివెన్సీ రూపములో నమోదు చేసి,వారికి అక్నాలెజ్మెంటు ఇస్తూ,వారి యొక్క సమస్యను గడువు లోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రామ సభలు ఈ నెల 18న ఇoగలదాహళ్,19న ముగుమనుగుంది,22న హోన్నూరు,23న ముద్దట మాగి,24న నాగరకన్వీ, 25న పెద్దగోనెహాల్,26న మడ్డిలింగదహళ్లి గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.