
నూతనపల్లెలో ఆర్యూ సి ఇ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ను అభినందించిన ఎమ్మెల్యే
కర్నూలు, ఆర్యూ న్యూస్ వెలుగు: రాయలసీమ ఇంజినీరింగ్ కాలేజీ జాతీయ సేవాపథకం 5వ యూనిట్ ఆధ్వర్యంలో నూతనపల్లె గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బి. దస్తగిరి హర్షంవ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛదివస్” కార్యక్రమంలో భాగంగా నూతనపల్లె గ్రామంలో ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పరిసరాల పరిశుభ్రతపట్ల ప్రజలు అవగాహన కలిగించాల్సిందిగా ఆయన వాలంటీర్లకు సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించుకుంటూనే స్వచ్ఛతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనపల్లె గ్రామాన్ని దత్తత గ్రామంగా ఎంపికచేసుకొని 50మంది విద్యార్థులతో స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి.వి. శివప్రసాదరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కర్నూలు జిల్లాపరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానికులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడంతోపాటు, వ్యర్థాల సమర్ధ వినియోగం గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణులు వాలంటీర్లతో కలిసి స్వచ్ఛాతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వెంకట రమణారెడ్డి, ఎంపీడీఓ రఘునాథ్, పంచాయితీ సెక్రటరీ వై. హేమంత్ కుమార్ రెడ్డి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘువీర మొదలైనవారు పాల్గొన్నారు.

