టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు
కల్లూరు, న్యూస్ వెలుగు : కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో పాణ్యం నియోజకవర్గం MLA గౌరి చరిత రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కల్లూరు మండలంలో మొదటగా బొల్లవరం గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రేమడూరు, పూసులూరు, బొల్లవరం, బస్తిపాడు, ఉల్లిందకొండ, యాపర్ల పాడు, తడకనపల్లె, మార్కాపురం, పెద్దకొట్టాల, చిన్నటేకూరు తదితర గ్రామాల నాయకుల తో పాటు. ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ . డి. రామాంజనేయులు, బొల్లవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు N. విజయ్ కుమార్, గ్రామ ప్రధాన కార్యదర్శి బి. వి జి. మస్తాన్ నాయుడు, ఉపాధ్యక్షులు బి. లక్ష్మన్న,బి. జానకిరాముడు,M. మధు, SMC చైర్మన్ డి. మస్తాన్ నాయుడు, BVG. వెంకటేశ్వర్లు, బాలోజీ సురేంద్ర , బి. సుధాకర్ , కార్యకర్తలు, బొల్లవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.