మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే  కెయి శ్యామ్ కుమార్

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే  కెయి శ్యామ్ కుమార్

అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్  చౌడప్ప

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి; మండలం లోని బొందిమడుగుల గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ యండ.చౌడప్ప ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్ సలహా దారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ సమక్షంలో ఎన్ ఆర్ జే సి నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని గ్రామాభివృద్ధి లక్ష్యంతో గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు పరుగులు పెట్టిస్తున్నారు.గ్రామంలో అభివృద్ధి పనులైన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మిస్తున్నందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని,ఇంకా బొందిమడుగుల గ్రామం నుంచి మారెళ్ళ గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిని కూడా ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ చొరవ తీసుకుని త్వరలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.శేషయ్య. ఏ. ఈ.వెంకటేశ్వర్లు.సచివాలయం ఇంజినీర్ శంకర్.వర్క్ ఇన్స్ పెక్టర్ ప్రభాకర్ రెడ్డి.మరియు బొంది మడుగుల గ్రామ వార్డు మెంబర్ వీరేంద్ర. కాశిమ్.వడ్డే వెంకటేష్.ఉషేన్.సుదర్శన్ మరియు టిడిపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!