
నేడు తుగ్గలికు ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు రాక
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే.
తుగ్గలి న్యూస్ వెలుగు: నేడు మండల కేంద్రమైన తుగ్గలికు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు వస్తున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు.ఈ సందర్భంగా సోమవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం నందు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు హాజరై ఉదయం 10 గంటలకు గ్రామంలో ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వంద రోజులలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను,అభివృద్ధి పనులను వివరిస్తారని ఆయన తెలియజేశారు. కావున ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని గల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు.