దేశ సంపదను ప్రైవేటుపరం చేసిన మోదీ
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది మహాత్మగాంధీ
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
అంబటి రామకృష్ణ యాదవ్
కర్నూలు, న్యూస్ వెలుగు; బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భారతదేశానికి అహింస మార్గంలో జైలు జీవితం అనుభవించి మహాత్మా గాంధీ మొదలగు దేశ నాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెడితే నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ సంపద అయిన ప్రభుత్వ ఆస్తులను నల్ల కుబేరులకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ గారి 155 జయంతి లాల్ బహుదూర్ శాస్త్రి గారి 120వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని కోరుచూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి నిరంకుశంగా విభజించి పాలించు పాలనకు వ్యతిరేకంగా శాంతి ప్రేమ సోదర భావంతో మహాత్మా గాంధీ దేశాన్ని ప్రజలను బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశాన్ని ఏ విధంగా కాపాడాడో గాంధీ జయంతి సందర్భంగా బిజెపి అనుసరిస్తున్న దుర్మార్గమైన ఆలోచన ధోరణిని నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహమునకు వినతిపత్రం ఇచ్చు కార్యక్రమం జరిగిందనీ దేశంలో అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక కులాలు అన్ని సమ్మిళితమైతేనే భారతదేశం అని, అనేక అనే పదాన్ని ఏకం చేసి అన్ని కలిపి ఉంచాలి అనే భావంతో మహాత్మా గాంధీ శాంతిని ప్రేమను సోదర భావాన్ని ఎంచుకొని స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక మార్గాన్ని చూపించడం జరిగిందనీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల పక్షాన నిలచి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ మైనార్టీలపై, దళితులపై చూపిస్తున్న వివక్షను, వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాలు అన్ని భాషలు అన్ని మతాలు సమానమని చెబుతూ భారత్ జోడో యాత్ర చేపట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి దేశాన్ని పూలదండలాగా చేపట్టి ఏకం చేశాడని అదే ఈ దేశానికి శ్రీరామరక్ష అని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధీ మార్గంలో నడుస్తుందని అదేవిధంగా హిందుత్వ ముసుగులో అయోధ్య అంశాన్ని తెరపైకి తెస్తున్న బిజెపి ప్రభుత్వం అక్కడి అయోధ్య ప్రజలు బిజెపిని వ్యతిరేకిస్తున్నారని మీరు చేసే మతోన్మాద కుయుక్తులను వారు గమనించారని ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 70 ఏళ్లలో చేసిన ప్రధానుల అప్పులు 56 లక్షల కోట్లు అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన పది సంవత్సరములలో 156 లక్షల కోట్లు అప్పు చేశారని అంటే మూడింతల అప్పు చేశారని రామకృష్ణ గారు విమర్శించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ బిజెపికి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనీ బిజెపిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎదిరించి పోరాడగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ బిజెపి భజన చేస్తున్నాయని మురళీకృష్ణ గారు విమర్శించారు. ముందుగా మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా నందికొట్కూరు రోడ్డు నందలి భూపాల్ నగర్ సమీపంలో గల అభయగిరి అనాధాశ్రమంలో మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అనాధలకు అల్పాహారము (టిఫిన్) పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద గల మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహమునకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా చిత్రపటములకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఆనవాయితీలో భాగంగా విలేకరులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, షేక్ జిలాని భాష, దామోదరం రాధాకృష్ణ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, ఎన్ సి బజారన్న, కే వెంకటరెడ్డి రియాజుద్దీన్ ఎస్ ప్రమీల ఏ వెంకట సుజాత కే రాఘవేంద్ర రెడ్డి, సాయికృష్ణ, షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రి పాషా అనంతరత్నం ఈ లాజరస్ పశుపల ప్రతాపరెడ్డి తిప్పన్న నాయుడు, సయ్యద్ నవీద్, అబ్దుల్ హై గీతా ముఖర్జీ నగర్ రమేష్ జాన్ సదానందం, అక్బర్ ఐఎన్టీయూసీ ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్ మహిళా కాంగ్రెస్ ఏ లలిత, హైమావతి, అయ్యమ్మ మద్దమ్మ స్వప్న సలోమి మొదలగు వారు పాల్గొన్నారు.